శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి 1,37,371 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుతం 873.50 అడుగులు ఉంది. జలాశయం గరిష్ఠ నీటినిల్వ 215.807 టీఎంసీలు కాగ...ప్రస్తుత నీటి నిల్వ 156.7696 గా ఉంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతుండగా..19,076 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు.
నిండుకుండలా సోమశిల జలాశయం..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం నిండు కుండలా మారింది రాయలసీమ ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు జలాశయం గేట్లు ఏ క్షణమైనా ఎత్తే అవకాశాలున్నాయని పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. అయితే ప్రస్తుతం జలాశయానికి రాయలసీమ ఎగువ ప్రాంతాల నుండి 28,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం దిగువ ప్రాంతాలకు 10,180 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 70 టీఎంసీలకు చేరింది.
ఇదీచదవండి: Corona Cases: దేశంలో 38వేల కొత్త కేసులు- భారీగా తగ్గిన మరణాలు