Murder in Kurnool: కుటుంబ కలహాలతో సొంత చిన్నాన్నను నరికి చంపిన ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణంలో చోటు చేసుకుంది. సురేంద్ర అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సురేంద్ర తన అన్న కూతురితో తరచూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఇలా రోజూ తన చెల్లెలితో అసభ్యకరంగా ప్రవర్తించడం మంచిదికాదని రాజేంద్ర తన చిన్నాన్నతో వాగ్వాదానికి దిగాడు. సురేంద్ర గొడ్డలితో రాజేంద్రపై దాడికి యత్నించాడు. ఈ క్రమంలో జరిగిన గొడవలో సురేంద్రపై రాజేంద్ర గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు . ఈ హత్య సురేంద్ర అసభ్యకరంగా ప్రవర్తించడంతోనే జరిగిందని బంధువులు అంటున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సురేంద్ర మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: