ETV Bharat / state

డప్పు పెట్టెలో మద్యం అక్రమ రవాణా.. పట్టుకున్న పోలీసులు

ఆటోల్లో, లారీల్లో.. ఇలా వివిధ రకాలుగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నారు కొందరు వ్యక్తులు. అసలు ఎవ్వరు ఊహించని రీతిలో డప్పు పెట్టెలో మద్యం బాటిళ్లను పెట్టుకుని కర్ణాటక నుంచి రాష్ట్రానికి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. 95 మద్యం టెట్రా ప్యాక్​లను స్వాధీనం చేసుకున్నారు.

illegal transport of alcohol through bands in kurnool district
డప్పు పెట్టెలో మద్యం అక్రమ రవాణా.. పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Aug 12, 2020, 10:05 PM IST

కొత్త కొత్త ఆలోచనలతో కొందరు వ్యక్తులు కర్ణాటక రాష్ట్రం నుంచి మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేయగా... డప్పు పెట్టెలో కర్ణాటక నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆదోనిలోని ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన మహమ్మద్ రసూల్, దస్తగిరి బాషా అనే ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి అక్రమంగా తరలిస్తున్న 95 టెట్రా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక మద్యం 90 ఎంఎల్ ధర రూ.87 పలికితే... మన రాష్ట్రంలో అయితే రూ.250 నుంచి 350 వరకు ఉంది. అందుకే ఇలాంటి దందా జోరుగా జరుగుతోందని పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి:

స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై ఆధారాలు సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.