ETV Bharat / state

భార్యను హత్య చేసిన భర్త.. ఆపై ఆత్మహత్య..!

క్షణికావేశంలో మనుషులు తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎంతో మంది అనాథలవుతున్నారు. స్వల్ప వివాదాలకు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఇటువంటి ఘటనే జరిగింది. దంపతుల మధ్య నెలకొన్న వివాదంలో కోపోద్రిక్తుడైన భర్త భార్యను హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

suicide
ఆత్మహత్య
author img

By

Published : Jul 12, 2021, 11:02 AM IST

కర్నూలు జిల్లా హొళగుంద ఎస్సీ కాలనీలో.. దంపతుల మధ్య కలహాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. క్షణికావేశంలో భర్త భార్యను హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హొళగుందకు చెందిన ముతమ్మ, మల్లికార్జునలు దంపతులు. వీరు తరచూ గొడవ పడుతుండేవారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కూడా వీరి మధ్య వివాదం జరిగింది. కోపోద్రిక్తుడైన మల్లికార్జున... భార్యకు ఉరివేసిన అనంతరం తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రుల మృతితో పిల్లలు ఇద్దరు అనాథలుగా మారారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: నంద్యాలలో రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.