ETV Bharat / state

ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు...లబ్ధిదారుల ఆందోళన - ఇళ్ల స్థలాల పంపిణీ తాజా వార్తలు

ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని పేదలు ఆనందపడ్డారు. స్థలాలు కేటాయించి ప్లాట్లు వేశారని తెలిసి సంబరపడిపోయారు. తీరా అది ముంపు ప్రాంతమని తెలిసి నీరుగారిపోయారు. ముంపు ముప్పు ఉన్న చోట ప్లాట్లు వద్దంటే వద్దంటున్నారు. మరోవైపు.... తాము ప్రభుత్వానికి ఇచ్చిన భూములను పేదలకు ఎలా కేటాయిస్తారంటూ రైతులు కోర్టును ఆశ్రయించారు. వెరసి కర్నూలు జిల్లా నంద్యాలలో ఇళ్లస్థలాల ప్రక్రియలో గందరగోళం నెలకొంది.

ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు
ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు
author img

By

Published : Dec 19, 2020, 5:57 PM IST

ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు

కర్నూలు జిల్లా నంద్యాలలో ఇళ్లస్థలాల ప్రక్రియ లబ్ధిదారులను ఆందోళనకు గురి చేస్తోంది. వైకాపా ప్రభుత్వం...నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో సుమారు 8 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం కుందూ నదికి ఇరువైపులా రెండు... భీమవరం వద్ద మరో రెండు లే అవుట్లను వేశారు. భీమవరం వద్ద 11 వందల మందికి, కుందూ లే అవుట్లలో మరో 6 వేల 800 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు.

కాగా.. అక్టోబరులో కురిసిన వర్షాలకు కుందూ నది పరిసర ప్రాంతాలు సహా లే అవుట్లూ నీట మునిగాయి. ఇళ్ల స్థలాలు వస్తాయని సంతోషించిన లబ్ధిదారులు...తీరా ఇలాంటిచోట కేటాయించారని తెలిసి నిరాశకు గురయ్యారు. ముంపు ముప్పు ఉన్న ప్రాంతంలో స్థలాలు ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ స్థలాలను కుందూ నది విస్తరణలో భాగంగా పదేళ్ల క్రితం ప్రభుత్వానికి ఇచ్చామని రైతులు చెబుతున్నారు. తమ భూములను పేదలకు ఎలా కేటాయిస్తారంటూ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

గత ప్రభుత్వం నంద్యాలలో 10 వేల టిడ్కో ఇళ్లను నిర్మించింది. వీటి కేటాయింపులోనూ జాప్యంపై తెలుగుదేశం, వామపక్షాలు ఆందోళనలు చేపట్టడంతో..వైకాపా ప్రభుత్వం అప్పగింతకు సిద్ధమైంది. ఈ నెల 20న టిడ్కో గృహాలు, అలాగే 25న భీమవరం లే అవుట్లలోని ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు ఇచ్చేలా ప్రణాళికలు చేశారు. కుందూ లే అవుట్ల వ్యవహారం కోర్టులో ఉన్నందున..అక్కడ కేటాయించిన వారికి పట్టాలు ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు. కాగా సురక్షిత ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ఇదీచదవండి

'చిత్తశుద్ధి ఉంటే రైల్వే జోన్​పై ఒత్తిడి తీసుకురండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.