ETV Bharat / state

న్యాయవాదిని బెదిరించిన రైతులకు రూ.5 లక్షల జరిమానా

ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేసిన ఘటనలో హైకోర్టు.. ఐదుగురు రైతులకు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఓ కేసులో న్యాయవాదిని బెదిరించినందున ధర్మాసనం చర్యలు చేపట్టింది.

High court on kurnool farmers
న్యాయవాదిని బెదిరించిన ఘటనలో రైతులకు జరిమానా
author img

By

Published : Nov 27, 2019, 8:49 AM IST

ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేసిన ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు రైతులకు లక్ష రూపాయల చొప్పున హైకోర్టు జరిమానా విధించింది. మైనింగ్‌కు సంబంధించిన ఓ కేసులో హైకోర్టు విచారణకు హాజరు కావొద్దని సంబంధిత న్యాయవాదిని బెదిరించినందున చర్యలు చేపట్టింది. రైతులు పిల్ దాఖలు చేయటం వెనుక ఓ ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లు ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. తమను పావులుగా వాడుకున్నారని, ఛార్జీలకూ సొమ్ములు లేని పేదలమని రైతులు విజ్ఞప్తి చేసినా... ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. న్యాయవాదిని బెదిరించే స్థాయి లేకున్నా... సంతకాలు మావేనని అంగీకరిస్తున్నందున జాలి చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఇదీ జరిగింది

కర్నూలు జిల్లా ఆవుకు మండలం సంగపట్నం గ్రామం పరిధిలో ప్రమీల అనే మహిళకు మొదట్లో అధికారులు మైనింగ్ అనుమతులు మంజూరు చేశారు. తర్వాత అవుకు తహసీల్దార్‌ నిరభ్యంతర పత్రం ఉపసంహరించుకుంటున్నట్లు 2011లో గనులశాఖ అధికారులకు లేఖ రాశారు. అనంతరం తవ్వకం పనుల్ని అధికారులు నిలిపేశారు. అధికారుల చర్యలను సవాలు చేస్తూ.. ప్రమీల 2011లో హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. అయితే ఆమె స్టే పొందిన విషయాన్ని దాచిపెట్టి కొలిమిగుండ్లగ్రా మండలం జిలు శింగవరం గ్రామానికి చెందిన ఎం . రమణారెడ్డి మరో ఐదుగురు రైతులు ఉన్నత న్యాయస్థానంలో పిల్​ దాఖలు చేసి ప్రమీలకు మైనింగ్​ లీజు మంజూరుపై స్టే పొందారు. ఇటీవల కేసు విచారణకు రాగా తాను కోర్టుకు హాజరైతే న్యాయవాదుల మండలికి ఫిర్యాదు చేస్తామని రైతులు బెదిరించినట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి:

భారతి సిమెంట్స్ ఆస్తుల జప్తుపై యథాతథస్థితి : హైకోర్టు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.