కర్నూలు జిల్లాలో గత 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ప్యాపిలి మండలంలో 125 m.m వర్షపాతం నమోదయింది. వరద ధాటికి నల్లమేకలపల్లి నుంచి రాంపురం, మామిళ్లపల్లి గ్రామాలకు వెళ్లే రహదారి కోతకు గురయింది. ఈ గ్రామాల ప్రజలు ప్యాపిలి, డోన్ కు వెళ్లాలంటే చుట్టూ 10 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. తెగిన రహదారిని చూడటానికి ఏ ఒక్క అధికారి రాలేదని గ్రామస్థులు ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: కర్నూలులో భారీ వర్షం... పొంగుతున్న వేదావతి