కర్నూలు నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ అన్నారు. గాజుల దిన్నె ప్రాజెక్టులో గేట్లు ఎత్తడంతో వరద నీరు హంద్రీ నదీకి పోటెత్తింది. ఉదయం నుంచి వరద జలాలు వస్తుండగా... రాత్రి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొత్తబస్టాండ్కు వెళ్లే ప్రదాన రహదారుల పైకి నీరు రావడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు.
ఇదీ చూడండి. గుంటూరు సర్వజనాస్పత్రిలో సత్వర స్పందన కరవు..!