గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నంద్యాల సమీపంలోని కుందునది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆత్మకూరు పట్టణంలో పలు కాలనీల్లో వాన నీరు చేరింది. దొర్నిపాడు హైస్కూల్ ప్రహరీ కూలింది. దేవనకొండ మండలంలోని చెరువులు నిండిపోయాయి. చాగలమర్రి మండలంలో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. దేవనకొండ మండలంలో చెరువులు నిండిపోయాయి. నంద్యాల పట్టణంలోని ఎస్సీ కాలనీ వద్ద మద్దిలేరు వాగు పొంగి ప్రవహిస్తోంది.
- కొట్టుకుపోయిన ద్విచక్రవాహనం...
చిన్నవాగే కదా... దాటి ఇంటికి చేరుదామనుకున్నారు. అయితే బైక్‌తో దాటే ప్రయత్నం చేశారు. మధ్యలోకి వెళ్లేసరికి ప్రవాహం ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. ఎంత ప్రయత్నించిన ఆ ద్విచక్రవాహనాన్ని కాపాడుకోలేకపోయారు ఆ యువకులు. వారి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో చోటుచేసుకుంది.
ఇదీ చదవండి: గండికోట జలాశయం ముంపు బాధితుల దీనస్థితి