కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎర్రవంక, భవనాసి వాగు, హఠ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చుట్టుపక్కల గ్రామాలు జలమయమయ్యాయి. వర్షం కురుస్తూనే ఉండటంతో పనులకు వెళ్లినవారు ఇళ్లకు చేరుకోవటానికి ఇబ్బంది పడ్డారు.
ఇదీ చదవండి అయోధ్యకు అహోబిలం నుంచి పవిత్ర మట్టి, జలాలు