కర్నూలు జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు నగరం సహా దేవనకొండ, హాలహర్వి, ఓర్వకల్లు, జూపాడు బంగ్లా, పత్తికొండ, హొళగుంద, సి.బెళగల్, ఆస్పరి, బండి ఆత్మకూరు, గోనెగండ్ల మండలాల్లో భారీ వర్షం పడుతోంది. వాన రాకతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
ఆస్పరి మండలం పలుకూరు బండ ములుగుందం రహదారిలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వంతెన కొట్టుకుపోయింది. పలు గ్రామాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. హాలహర్వి మండలంలోని ఊరివంక వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హాళహర్వి ఎస్సీ కాలనీలోకి వరద నీరు చేరటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హాళహర్వి- నిట్రవట్టి, గుల్లెం- సిద్ధాపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు గాజులదిన్నె ప్రాజెక్టుకు 60 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి