ETV Bharat / state

గూడూరు నగర పంచాయతీ చైర్మన్​గా జులపాల వెంకటేశ్వర్లు

కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెదేపా, భాజపా, స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.

GUDUR CHAIRMAN
గూడూరు నగర పంచాయతీ చైర్మన్​గా జులపాల వెంకటేశ్వర్లు
author img

By

Published : Mar 19, 2021, 3:16 PM IST

కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ చైర్మన్​గా జులపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్​గా పీఎన్. ​అస్లాం ప్రమాణ స్వీకారం చేశారు. కౌన్సిలర్లు అందరూ వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రత్యేక అధికారి మోహన్ దాస్ ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి తెదేపా, భాజపా, స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన కౌన్సిలర్లు పలువురు హాజరు కాలేదు. కోరం పది మంది కంటే ఎక్కువ ఉండటంతో ప్రక్రియను కొనసాగించారు.

గూడూరు నగర పంచాయతీలో వైకాపా రెండోసారి గెలుపొందటం సీఎం జగన్​ విజయమని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. నూతన పాలక వర్గానికి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి: డోన్ మున్సిపాలిటీ ఛైర్మన్​గా సప్తశైల రాజేష్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.