కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిధిలో ఉన్న విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేస్తూ ఏపీ ప్రభుత్వం అధికారిక ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్ (ఎయిర్‌పోర్టు) శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్.కరికాల వలవెన్ ఆదివారం జీవో 21ని జారీ చేశారు.
కర్నూలుకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ధీశాలి. ఈ ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఓర్వకల్లులోని విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించిన రోజున ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి: