కర్నూలు జిల్లా నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్యపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. బాధ్యులైన పోలీసులను ప్రభుత్వం అరెస్టు చేసిందని చెప్పారు. నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం కుమ్మక్కై బెయిల్ ఇప్పించిందని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు. నంద్యాలలో జరిగిన ఘటనపై తామందరమూ బాధపడుతున్నామని చెప్పారు. ఘటనకు వ్యవస్థ మొత్తం కూడా బాధ్యత వహించాల్సి ఉందన్న బొత్స... కోర్టు కేసుల విచారణ సత్వరమే పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. పేదలందరికీ స్థలం, ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని ఉద్ఘాటించారు.
ఇదీ చదవండీ... అక్రమ అరెస్టులతో వేధింపులు.. శాంతియుత నిరసనలపైనా ఉక్కుపాదం