ETV Bharat / state

వేరుశనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఐ రామకృష్ణ

అకాల వర్షాలతో వేరుశనగ పంట నష్టపోయిన రైతులను... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కర్నూలు జిల్లాలో పరామర్శించారు. వేరుశనగ కాయలు ఎదుగుదల లేకపోవడంతో పశువులకు మేత కూడా రావడం లేదని ఆయన పేర్కొన్నారు.

government should support groundnutnut farmers says cpi ramakrishna
వేరుశనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఐ రామకృష్ణ
author img

By

Published : Oct 11, 2020, 10:00 PM IST

అకాల వర్షాలతో వేరుశనగ పంట నష్టపోయిన రైతులను... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు. కర్నూలు జిల్లాలో ఆయన పర్యటించారు. అరకొరగా పండిన పంటలు కూడా అకాల వర్షాలతో తడిసి... వేరుశనగ కాయలు ఎదుగుదల లేకపోవడంతో పశువులకు మేత కూడా రావడం లేదని ఆయన పేర్కొన్నారు. రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెడితే కనీసం పెట్టుబడికి పెట్టిన డబ్బులు కూడా రాలేదని ఆవేదన చెందారు.

రైతన్నలు అప్పులు ఎలా కట్టాలని వారు ఆందోళన చెందుతున్నారన్నారు. క్షేత్ర స్థాయి అధికారులతో ప్రభుత్వం వెంటనే రైతుల పొలాల్లో పంట నష్టం అంచనా నివేదికలు తయారు చేయించి, సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్​లను ప్రకటించాలన్నారు.

ఇదీ చదవండి:

వికేంద్రీకరణ పేరుతో నాశనం చేస్తున్నారు: దివ్యవాణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.