ETV Bharat / state

నిర్లక్ష్యానికి నిదర్శనం... విద్యార్థులకు శాపం!

ఎటు చూసినా చెత్తా చెదారం.. పశువుల సంచారం. ఇదేదో డంపింగ్ యార్డ్ అనుకుంటే మాత్రం పొరబాటే. 1 కాదు.. 2 కాదు. ఏకంగా 6 దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న పాఠశాల ఇది. ఎంతో మంది విద్యార్థులను జాతికి అందించిన విద్యాలయమిది. ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం. మరి.. ఇలా ఎందుకు మారిపోయింది అంటే.. నిర్లక్షమే కారణమన్న సమాధానం స్థానికుల నుంచి వినిపిస్తోంది.

school
author img

By

Published : Sep 7, 2019, 4:37 PM IST

Updated : Sep 7, 2019, 5:23 PM IST

ఈ బడి మూతపడి మూడేళ్లయ్యింది.. తెరిచేదెన్నడో!

కర్నూలు జిల్లా ఆదోని మండలం యడవళ్లి గ్రామం... సరిగ్గా కర్ణాటక సరిహద్దుకు కిలోమీటరు దూరంలో ఉంటుంది. సకల అసౌకర్యాలకు నిలయంగా.. పాలకుల నిర్లక్ష్యానికి ఫలితంలా.. ఈ గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. యాడవళ్లిలో 30 ఇళ్లు ఉన్నాయి. దాదాపు 50 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు చదువుకునేందుకు ఇక్కడ ప్రభుత్వ పాఠశాల లేదు. ఉన్న బడిని.. మూడేళ్ల క్రితం రకరకాల కారణాలతో మూసేశారు. అది కాస్తా.. ఇలా పశువులకు నిలయమైంది. చెత్తాచెదారానికి చిరునామాగా మారింది.

6 దశాబ్దాల చరిత్ర

యడవళ్లి పాఠశాల చరిత్ర చిన్నదేమీ కాదు. 60 ఏళ్ల క్రితం 1960లోనే ఈ బడిని ఏర్పాటు చేశారు. ఎంతో మంది ఇక్కడి నుంచి విద్యార్థులుగా విజయవంతమయ్యారు. జీవితంలో నిలదొక్కుకున్నారు. రాను రాను ఈ పాఠశాల ప్రాభవం కోల్పోయింది. మూడేళ్ల క్రితం రకరకాల కారణాలతో బడిని మూసేశారు. రవాణా సౌకర్యం సరిగా లేదని.. రహదారులు లేవని.. వర్షం వస్తే వాగు పొంగుతుందని.. రకరకాల కారణాలతో బడి లేకుండా చేశారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. చదువు కోసం తమ పిల్లలు.. నాలుగైదు కిలోమీటర్లు వెళ్లి రావాల్సివస్తోందని చెప్పారు.

బడి ఒక్కటే కాదు.. మరిన్ని..

యడవళ్లిలో బడి మాత్రమే కాదు. అంగన్వాడీ కేంద్రం లేదు. చౌక ధరల దుకాణం లేదు. వీటికి తోడు.. ఉన్న బడినీ మూసేశారు. మూడేళ్లయినా తెరిపించేందుకు పాలకులు, అధికారులు శ్రద్ధ తీసుకోవడం లేదు. తమ సమస్యలు ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

Intro:ap_cdp_16_07_karmikuralu_died_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
కడప రామాంజనేయ పురం లోని షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ లో జరిగిన ప్రమాదంలో 19 ఏళ్ల యువతి మృతి చెందింది. యంత్రంలో పడడంతో మృతదేహం నుజ్జునుజ్జయింది. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. నేపాల్ కు చెందిన గాయత్రి తల్లిదండ్రులు 18 ఏళ్ల క్రితం కడప కు వచ్చి స్థిరపడ్డారు. రామచంద్రపురం లో ఉన్న షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ లో గత ఎనిమిది మాసాల నుంచి గాయత్రి పనిచేస్తుంది. ప్రతి రోజు లాగానే ఈ రోజు కూడా విధులకు వెళ్ళింది. ఆ సమయంలో ప్రమాదవశాత్తు యూనిఫారం క్రషింగ్ యంత్రంలో పడడంతో గాయత్రి కూడా అ యంత్రంలో కి వెళ్లడంతో నుజ్జు నుజ్జు అక్కడికక్కడే దుర్మరణం చెందింది. గాయత్రి ని కాపాడు పోయిన మరో కార్మికురాలు కి తీవ్రగాయాలయ్యాయి. బిడ్డ మృతదేహాన్ని చూసి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని వృద్ధురాలి సోదరి జమున ఆరోపించారు.
byte: జమున, మృతురాలి సోదరి, కడప.

Body:మహిళా కార్మికులు మృతి

Conclusion:కడప
Last Updated : Sep 7, 2019, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.