Officers Warning to Women: కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ పాఠశాలలో ఈ నెల 5వ తేదీన జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతున్నారని, పొదుపు సంఘాల మహిళలు తప్పనిసరిగా రావాలని ఓ రిసోర్స్ పర్సన్ (ఆర్‌పీ) వాట్సప్ ద్వారా హుకుం జారీ చేశారు. సభకు రాని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవని అందులో హెచ్చరించారు.
ఉదయం 7 గంటలకల్లా శక్తి గుడి మైదానానికి చేరుకోవాలని, అక్కడ టిఫిన్ చేయించి కార్యక్రమానికి తీసుకెళతారని పేర్కొన్నారు. సీఎం కార్యక్రమానికి వెళ్లకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని హెచ్చరించడం దారుణమని కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: