కర్నూలు జిల్లా నంద్యాలలోని మధుమణి నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగింది. ఆయన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 100మంది పేదవారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తామని తెలిపారు. కార్యక్రమానికి పలు రాష్ట్రాలకు చెందిన వైద్యులు, ప్రముఖ వైద్య నిపుణులు హాజరయ్యారు. అనంతరం చెవి, ముక్కు, గొంతు శస్త్ర చికిత్సలు ప్రత్యక్షంగా చేసి వైద్యులకు అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేశారు.
100 మందికి ఉచితంగా శస్త్ర చికిత్సలు - nandyal
ఏదైనా శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తే కొత్త అంశాలపై అవగాహన కల్పిస్తారని అనుకుంటాం. శిక్షణ సమయంలో ప్రత్యేక అంశాలను మరింత సులువుగా అర్థమవ్వడానికి పవర్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తారు కొందరు. కాని ఈ వైద్యులు మాత్రం అందుకు భిన్నంగా ప్రత్యక్షంగా శస్త్ర చికిత్సలు చేసి చూపించారు.
కర్నూలు జిల్లా నంద్యాలలోని మధుమణి నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగింది. ఆయన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 100మంది పేదవారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తామని తెలిపారు. కార్యక్రమానికి పలు రాష్ట్రాలకు చెందిన వైద్యులు, ప్రముఖ వైద్య నిపుణులు హాజరయ్యారు. అనంతరం చెవి, ముక్కు, గొంతు శస్త్ర చికిత్సలు ప్రత్యక్షంగా చేసి వైద్యులకు అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేశారు.
Body:పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడులో సర్వే నెంబరు 308 లో 94 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి శేషాచల కొండ దిగువున ఉండడంతో రూ. కోట్లు పలుకుతుంది. ఇక్కడ సెంటు భూమి విలువ సుమారు రూ 1.50 లక్షలు వరకు ఉండడంతో దీనిపై అక్రమార్కుల కన్ను పడింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించుకుని పట్టా సృష్టించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ భూమి చుట్టూ పెన్సింగ్ వేసి దర్జాగా వరి సాగు చేస్తున్నాడు. అయినా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమిగా ఉన్నా రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. పేదవాడు ఇల్లు నిర్మించుకోవడానికి సెంటు భూమి ఇవ్వాలంటే వంద కారణాలు చెప్పి జాప్యం చేసే అధికారులు అక్రమార్కులకు రూ .కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను ఎలా కట్ట పెడుతున్నారంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు .గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే మరోవైపు అక్రమార్కులు ఆ భూములను కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కబ్జాదారులు రెచ్చిపోతున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాకు గురైన భూమి ఆక్రమణలు తొలగించి నిరు పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని కోరుతున్నారు
Conclusion:దొరసానిపాడు గ్రామంలో సర్వే నంబరు 308 లో ఎంత భూమి ఉందనేది పరిశీలించి ఆక్రమణకు గురైతే చర్యలు తీసుకుంటామని ద్వారకాతిరుమల తహసీల్దారు ఎం రామకృష్ణ తెలిపారు. ఇప్పటికే ఆ భూమిని సర్వే చేసి ఒక నివేదిక ఇవ్వాలని తమ సిబ్బందికి ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు .నివేదిక అందిన వెంటనే తదుపరి చర్యలు తీసుకొని ఆక్రమణ తొలగిస్తామన్నారు.