ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహానికి శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జలాశయంలో 5 లక్షల 62 వేల 678 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా... 5 లక్షల 6 వేల 932 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగుల వద్ద ఉంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 206.45 టీఎంసీలలకు చేరింది.
10 గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు 4 లక్షల 71 వేల 90 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 27 వేల 154 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ద్వారా 7 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 1688 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇదీ చూడండి: