కర్నూలు శివారు గాయత్రి గోశాల వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గోశాలకు చెందిన పశుగ్రాసం కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే గోవులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సమీప గ్రామాల్లోని పశువుల కాపరులు.. బీడీలు తాగి పడేయటం వల్లే అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: అదృశ్యమైన బాలుడు.. ఇంటికి సమీపంలోనే విగతజీవిగా!