LAKKASAGARAM PUMP HOUSE: కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరం పంప్ హౌస్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పత్తికొండ శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవి, జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. డోన్ మండలం అబ్బిరెడ్డిపల్లి చెరువు బస్‌స్టాప్ నుంచి గ్రామం వరకు రూ. 77 లక్షలతో నిర్మించిన సీసీ రహదారిని మంత్రి ప్రారంభించారు. జిల్లాలో 68 చెరువులకు నీరు నింపే కార్యక్రమంలో భాగంగా నేడు పంప్ హౌస్‌ను పరిశీలించినట్లు వారు తెలిపారు.
గత ప్రభుత్వంలో 15 శాతమే పనులు పూర్తయ్యాయని.. కొత్తగా తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 60 శాతం మేర పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. మిగిలిన పనులు సైతం త్వరలోనే పూర్తి చేసి.. 68 చెరువులకు నీటిని తరలించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయాలపై అవగాహన లేకనే మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి.. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 80 శాతం పనులు పూర్తి చేసినట్లు చెప్పడం విడ్డురంగా ఉందని నేతలు అన్నారు.
ఇదీ చదవండి:
Food Poison: మధ్యాహ్న భోజనం వికటించి.. 40మంది విద్యార్థులకు అస్వస్థత