ఎక్కడి నుంచో వచ్చారు. నాణ్యమైన ఎరువులంటూ ప్రచారం చేశారు. నమ్మి కొన్న రైతుల నోట్లో బూడిద కొట్టారు. కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం టంగుటూరు గ్రామానికి పదిరోజుల క్రితం కొందరు వచ్చారు. తాము అనంతపురం జిల్లా నుంచి వచ్చామంటూ, విజయ గ్రోమిన్ పేరిట ఉన్న ఎరువులకు ప్రచారం చేశారు. దాదాపు 15 మంది రైతులకు బస్తా రూ.వెయ్యి చొప్పున రూ.1.5లక్షల విలువైన ఎరువులు విక్రయించారు. ఆ బస్తాల్ని తాజాగా తెరిచి చూడగా అందులో బూడిద ఉన్నట్లు గుర్తించారు. తాము మోసపోయామని గ్రహించి వారి ఫోన్ నంబర్లకు కాల్ చేయగా అవి పనిచేయలేదు. రూ.10 వేల విలువ చేసే పది బస్తాలు కొంటే ఐదు బస్తాలు ఉచితంగా ఇస్తామన్నారని, తిరుపతి నగరం ఎస్కేడీ సర్కిల్ చిరునామా ఉన్న వినూత్న ఫెర్టిలైజర్స్ పేరిట రసీదులు ఇచ్చినట్లు రైతులు చెప్పారు.
ఇదీ చదవండి: