కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌కు రాష్ట్రంలోనే అతిపెద్ద పత్తి మార్కెట్‌గా పేరుంది. ఏటా దసరా సమయంలో సీజన్ ప్రారంభమయ్యేటపుడు నిత్యం 4 వేల మంది వరకు రైతులు మార్కెట్‌కు వస్తారు. రాయలసీమ జిల్లాలు సహా.. కర్నాటక నుంచి రైతులు ఇక్కడికి వచ్చి ఉత్పత్తులు విక్రయిస్తుంటారు. ఏటా 1500 కోట్ల వ్యాపారం ఇక్కడ జరుగుతుందంటే అతిశయోక్తి కాదు.
రూ.10 నుంచి 15కే నాణ్యమైన భోజనం..
రైతుల రద్దీ దృష్ట్యా తక్కువ ధరకే మంచి భోజనం అందించాలనే ఆలోచనతో నాలుగేళ్ల క్రితం ఈ మార్కెట్‌లో క్యాంటీన్ ఏర్పాటు( canteen at Adoni Agricultural Market) చేశారు. ఇస్కాన్ సహకారంతో ఏర్పాటుచేసిన ఈ క్యాంటీన్‌లో రూ. 10 నుంచి 15కే నాణ్యమైన భోజనాన్ని అందించేవారు. అలాంటి క్యాంటీన్‌ని గతేడాది అధికారులు మూసేశారు. దీంతో బయట భోజనం చేయడం వల్ల తమకు ఖర్చు పెరిగిపోతుందని రైతులు వాపోతున్నారు.
ఆ క్యాంటీన్లతో ఎంతో మేలు..
మార్కెట్‌కు తీసుకొచ్చిన సరకు వద్ద తాము లేకపోతే దొంగలిస్తారని.. భోజనం కోసం బయటికి వెళ్తే పత్తిదొంగలు మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని రైతులంటున్నారు. మార్కెట్‌లోనే క్యాంటీన్ ఉంటే తక్కువ ధరకే భోజనం చేసి త్వరగా రావచ్చని ఇది తమకు ఎంతగానో మేలు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు(request to Canteen open at Adoni Agricultural Market). నవంబర్ మొదటి వారంలో క్యాంటీన్ తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి..
CBN KUPPAM TOUR: కుప్పంలో చంద్రబాబు పర్యటన.. భారీగా తరలివస్తున్న కార్యకర్తలు