ETV Bharat / state

వేరుశెనగ కొనుగోలులో వ్యాపారుల 'చేతి'వాటం.. లబోదిబోమంటున్న రైతులు - Groundnut Farmers

The Plight Of Groundnut Farmers : వ్యవసాయ మార్కెట్​లో వేరుశెనగ కొనుగోలు వ్యాపారులు చేతివాటం చూపుతున్నారు. మార్కెట్ లో దిగుబడులను పరిక్షించేందుకు ఏర్పాటు చేసిన ల్యాబ్ అలంకారప్రాయంగా మారింది. దీంతో మార్కెట్లో ధర ఉన్నా.. వ్యాపారులు చెప్పిందే ధరగా నిర్ణయిస్తున్నారు.

వేరుశెనగ
Peanut
author img

By

Published : Feb 19, 2023, 7:36 PM IST

వ్యాపారుల 'చేతి'వాటం.. లబోదిబోమంటున్న రైతులు

The Plight Of Groundnut Farmers : పంట పండించే రైతులు విత్తనం నాటిన నుంచి మొలకెత్తి పంట చేతికొచ్చే వరకు జాగ్రత్తగా కాపాడతారు. పండిన పంట పురుగులు, పక్షులు, జంతువుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. చీడపీడల నుంచి రక్షిస్తారు. నిరంతరం పంటపై దృష్టి సారించి అధిక దిగుబడి కోసం కృషి చేస్తారు. అంతటి కష్టం చేసిన కర్షకులకు.. కష్టానికి తగిన ఫలితం రావడం లేదు. ఓ వైపు దళారుల బారిన పడి రైతులు నష్టాన్ని చవిచూస్తుంటే.. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్​కు పండిన పంటను తీసుకెళ్తే అక్కడా గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కర్నూలు జిల్లాకు చెందిన వేరుశనగ రైతులు.

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వేరుశెనగ దిగుబడులు కొనుగోలులో పేరుగాంచింది. వేరుశెనగ ఉత్పత్తులను అమ్మేందుకు ఉమ్మడి జిల్లాలోని పలు మండలాలతో పాటు అనంతపురం జిల్లాలోని సరిహద్దు ప్రాంతం నుంచి దిగుబడులు విక్రయించేందుకు రైతులు వస్తారు. మార్కెట్​కు ఏటా ఐదు లక్షల వేరుశనగ బస్తాలు విక్రయానికి రైతులు తెస్తారు. మార్కెట్​కు వేరుశెనగ ఉత్పత్తుల అమ్మకాల ద్వారా ఏటా కోటి రూపాయలకు పైగా ఆదాయం వస్తుంది.

వేరుశెనగ ఉత్పత్తుల నాణ్యత, నూనె, తేమ శాతం, చెత్తాచెదారం, ఎదగని కాయలు పరిక్షించేందుకు ఈనామ్ కింద ఐదేళ్ల క్రితం ల్యాబ్ ఏర్పాటు చేశారు. టెండర్​​కు కుప్పగా పోసిన వేరుశనగ దిగుబడులు నుంచి ల్యాబ్ సిబ్బంది నమూనాలు సేకరించి పరీక్షించి ఫలితాలను ఆన్​లైన్​లో​ పెడతారు. వాటి ఆధారంగా వ్యాపారులు ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ చేతితో పరీక్షించి ధర వేస్తున్నారు..

వ్యాపారులు వేరుశనగ ఉత్పత్తులను చేతితో పరీక్షించి ధర వేయడం వల్ల.. కాయలు నాణ్యంగా ఉన్నా సరైన ధర లభించక రైతులు నష్టపోతున్నారు. రైతుకు ఉత్పత్తులను బట్టి ధర లభించాలంటే ల్యాబ్ పరీక్షల ఆధారంగా ధర కోడ్ చేస్తే మంచి ధర లభిస్తుందని రైతులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.