Farmers Massive Migration In Kurnool District : వీదంతా నిర్మానుష్యం.. ఎటుచూసినా నిశ్శబ్ధం.. వందల ఇళ్లకు తాళం.. ఆ ఊళ్లకు వెళితే చూడడానికి కర్ఫ్యూను తలపిస్తోంది! ఇది పోలీస్ కర్ఫ్యూ కాదు.! కరవు విధించిన కర్ఫ్యూ.! కరవు తరమితే ఆవరించిన నిశ్శబ్ధ వాతావరణం.! ఇంతటి నిశ్శబ్ధ వాతావరణంలోనూ ఎక్కడో ఒకట్రెండు ఇళ్లలో జనం అలికిడి వినిపిస్తోంది. ఇంటికొక్కరో, ఇద్దరో, అందులోనూ చంటి పిల్లలు.! కానీ తల్లిదండ్రులు లేరు. అమ్మమ్మో, నానమ్మో వాళ్ల బాగోగులు చూస్తున్నారు. వాళ్లను పలకరిస్తే ఆ నిశ్శబ్ధం వెనకున్న బాధ కన్నీటి రూపంలో కట్టలు తెంచుకుంటోంది.
Kurnool District Drought Leads to Migrating : ఇదీ కరవు కాటుకు గురైన కర్నూలు జిల్లా పల్లెపాడు ఎస్సీకాలనీ పరిస్థితి. ఇందులో 200 కుటుంబాలకుగాను ఇప్పుడు 50 కుటుంబాలే మిగిలాయి. అంటే 150 కుటుంబాలు పొట్ట చేతబట్టుకుని వలస పోయాయి. వారానికో పది రోజులుకో ఒక్కో కుటుంబం ఇలా మూటముల్లె సర్దుకుని ఊరొదిలి వెళ్తున్నాయి. కొందరు పిల్లాజెల్లాతో పయనమవుతంటే మరికొందరు తల్లిదండ్రుల్ని, గుక్కపట్టి ఏడుస్తున్న బిడ్డల్ని ఇళ్ల వద్దే వదిలి భారంగా బయల్దేరుతున్నారు.
పనుల కోసం పొరుగు రాష్ట్రాలకు.. ఒక్క పశ్చిమప్రకాశం నుంచే దాదాపు 50 వేల కుటుంబాల వలస
Migration Villages to Cities in Rayalaseema : ఈ దీనస్థితి ఒక్క పల్లెపాడుదే కాదు. ఉమ్మడి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని అనేక పల్లెలు.. కన్నీరు పెడుతున్నాయి. జూన్ నెల నుంచి అక్టోబర్ నెల వరకు అటు ఖరీఫ్‌లోనూ ఇటు రబీలోనూ.. లోటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌లో పంటలపై ఆశలు వదులుకున్న రైతన్న, రబీలో అయినా కాస్తో కూస్తో వర్షాలు కురువకపోతాయా అన్న ఆశతోవేచి చూశారు. అయినా వరుణుడు కనికరించలేదు. ఫలితంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వేసిన పంటలు ఎండిపోతుండగా వేలాది ఎకరాలు సాగు చేయకుండా బీళ్లుగానే మిగిలిపోయాయి. మరోవైపు భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతుండటంతో బోరు బావులు ఎండిపోతున్నాయి. కనుచూపుమేరలో బీళ్లుతప్ప పచ్చదనం కానరాక.. కుటుంబాలకు కుటుంబాలు వలస పోతున్నాయి.
Migration In West Prakasam : నీరు లేక.. కూలీలుగా మారుతున్న పశ్చిమ ప్రకాశం రైతులు
Rayalaseema Villages are Empty.. Kurnool District Drought : ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాధారణ విస్తీర్ణంలో సాగైంది 15 శాతమే.అది కూడా చేతికందే పరిస్థితి లేదు. బతుకుజీవుడా అంటూ కర్ణాటక,.. తెలంగాణ రాష్ట్రాలకు వలసపోతున్నారు.ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లోని 19 మండలాల నుంచి ఎక్కువ మందిఊరొదిలిపోతున్నారు. కర్నూలు జిల్లాల నుంచి 50 వేల మంది వెళ్తే.. కోసిగి మండలం నుంచే.. 19 వేల మంది తరలిపోయినట్లు అంచనా. దీంతో గ్రామాలు కళతప్పుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు పడకేయడంతో మరోదారి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు.
No Water No Work In Kurnool : జిల్లాలో ఇంత దయనీయ పరిస్థితులు నెలకొన్నా.. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. వ్యవసాయశాఖ, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, అనుబంధ శాఖల అధికారులు ఇంతవరకు ప్రత్యామ్నాయ ప్రణాళికపై దృష్టి సారించకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రభుత్వం తమను ఆదుకునే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.