కర్నూలు జిల్లా నంద్యాలలో వైద్య కళాశాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని... కానీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం స్థానంలో దాన్ని ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి ఏ మాత్రం తగదని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి అన్నారు. నంద్యాలలో రైతు సదస్సు నిర్వహించారు. వైద్యకళాశాలను పట్టణంలోని మరోచోట నిర్మించాలని పేర్కొన్నారు. దీనిపై గ్రామాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.

ఈ సదస్సులో పరిశోధన కేంద్రం పరిరక్షణ, పంట నష్టపరిహారం, దిల్లీలో రైతుల దీక్ష, వారసత్వ సంపద, కేసీ కాలువ, తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: