కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కె.నాగలాపురంలో 'రైతు సదస్సు-వ్యవసాయ ప్రదర్శన' కార్యక్రమం నిర్వహించారు. మహానంది వ్యవసాయ కళాశాల విద్యార్థులు క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాము కళాశాలలో కంటే రైతుల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని తెలిపారు. సిఫార్సు మేరకు రైతులు ఎరువులను వినియోగిస్తే మంచి దిగుబడులు పొందవచ్చునని వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: అక్షరం ముక్కరాదు... వ్యవసాయంలో పీహెచ్డీ చేశాడు..!