వైకాపా ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగిపోతున్న చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్షకుమార్, జడ్జి రామకృష్ణ కర్నూలులో విమర్శించారు. పుడిచర్ల గ్రామంలో గత సంవత్సరం నవంబర్ నెలలో జరిగిన దళిత యువకుడి హత్య కేసులో పోలీసులు మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు తీసుకోవడం లేదని ఆరోపించారు.
ఓ వైకాపా ఎమ్మెల్యే పొలంలో ఈ హత్య జరిగిన కారణంగా పోలీసులు సరిగా విచారణ జరపడం లేదన్న అనుమానం కలుగుతోందన్నారు. దళితులపై దాడుల విషయంలో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు.
ఇదీ చదవండి