ETV Bharat / state

అధ్వానంగా ఎల్లెల్సీ ఆధునికీకరణ పనులు.. 9ఏళ్లలో రూ.130 కోట్లు ఖర్చు - కర్నూలులో అధ్వానంగా ఎల్లెల్సీ ఆధునికీకరణ పనులు

ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎల్లెల్సీ ఆధునికీకరణకు నిధులు విడుదల చేసింది. నీళ్లు పారాల్సిన కాలువలో నిధులు పారాయి. గుత్తేదారులు పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చి నిధులను పక్కదారి పట్టించారు. అడుగడుగునా నాణ్యత లోపించడంతో లైనింగ్‌ మొత్తం దెబ్బతింది. చుక్కనీరు అందక అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది.

Ellelsi development
Ellelsi development
author img

By

Published : Aug 10, 2020, 12:12 PM IST

కర్నూలు జిల్లా తుంగభద్ర దిగువ కాల్వకు లైనింగ్‌, చిన్న కాల్వలకు సంబంధించి నిర్మాణాలకు ప్రభుత్వం 2009లో నిధులు మంజూరు చేసింది. రెండేళ్లలో ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రా సరిహద్దు నుంచి కోడుమూరు వరకు ఉన్న కాల్వలకు లైనింగ్‌ చేపట్టాల్సి ఉంది. అప్పట్లో రూ.179 కోట్లు విడుదలయ్యాయి. ఈ పనులను 18 ప్యాకేజీలుగా విభజించారు. ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు డివిజన్‌ కింద విభజించి అప్పగించారు. కాల్వకు నీరు పారని సమయంలో చేపట్టాలని ప్రభుత్వం పేర్కొంది. రెండేళ్లలో పూర్తి చేయాలని, మెయిన్‌ కెనాల్‌, డిస్ట్రిబ్యూటర్లు, సీసీ లైనింగ్‌, కెనాల్‌పై మట్టి రహదారులు వేసేలా ఉత్తర్వులు ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా నాయకులు, అధికారుల జోక్యంతో నాణ్యత లోపించింది. పనులు సకాలంలో పూర్తిచేయకపోవడంతో ప్రస్తుతం వాటన్నింటినీ రద్దు చేశారు. మరోవైపు కేటాయించిన నిధుల్లో రూ.130 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

కానరాని పర్యవేక్షణ

2019-20లో ఎల్లెల్సీ కాల్వల షట్టర్లు, ఇతర మరమ్మతుల నిమిత్తం ప్రభుత్వం రూ.14 కోట్లు విడుదల చేసింది. ప్రధానంగా కాల్వలపై రోడ్లు, గట్లు తెగిన చోట మరమ్మతులు చేసి బలోపేతం చేయడం, ఇతర పనులు చేపట్టాల్సి ఉంది. ఇందులో 50 శాతం పూర్తవగా.. ఆదోని, ఎమ్మిగనూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో జరగలేదు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి.

దశాబ్దాల కిందట నిర్మించిన కాల్వ కావడంతో చాలాచోట్ల మట్టి గట్లు దెబ్బతిన్నాయి. ఆంధ్రా సరిహద్దు నుంచి మెయిన్‌ కెనాల్‌ 150 కిలోమీటర్ల పొడవు ఉంది. సీసీ లైనింగ్‌ లేకపోవడంతో చాలావరకు నీరు వృథా అవుతోంది. మరోవైపు కొందరు తమ ఇష్టానుసారంగా జలచౌర్యం చేస్తూ వాడేస్తుండటంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందక బీళ్లుగా మారుతున్నాయి.

కాలువ పరిస్థితి ఇలా..

  • 6-ఏ కింద మెయిన్‌ కెనాల్‌ 315 కి.మీ. నుంచి 320 కి.మీ. వరకు సీసీ లైనింగ్‌, షట్టర్లు, ఇతరాలు చేపట్టారు. నాణ్యత కరవవడంతో చాలావరకు దెబ్బతిన్నాయి. గుడేకల్లు చెరువు సమీపంలో నిర్మించిన గోడలు పగలిపోయాయి. డీపీ 81 కాల్వ తూము వద్ద ఉన్న లైనింగ్‌ పగుళ్లిచ్చింది. దీని కోసం రూ.3 కోట్ల వరకు ఖర్చు చేశారు.
  • ప్యాకేజీ నంబరు 6బి కింద మిట్టసోమాపురంలోని డీపీ 81, 82, 83 కాల్వలకు రూ.9.46 కోట్లు కేటాయించగా 80 శాతం పనులు పూర్తి చేశారు.
  • మాధవరం మేజర్‌ ప్యాకేజీ కాల్వ ఆధునికీకరణ పనులకు రూ.7.45 కోట్లతో టెండర్లు పిలిచారు. పనులను దాదాపు పూర్తి చేశారు. ఉప గుత్తేదారుడు చేపట్టడంతో నాణ్యత కానరావడం లేదు.
  • సూగూరు కాల్వకు రూ.3.20 కోట్లు ఖర్చు పెట్టారు. లైనింగ్‌, డిస్ట్రిబ్యూటరీలు, షట్టర్లు బిగించారు. నాణ్యత లేకపోవడంతో షట్టర్లు విరిగిపోయాయి. కాల్వ పొడువునా సీసీ లైనింగ్‌ పగిలిపోయింది. చెట్నిపల్లి వరకు దాదాపు 8 కిలోమీటర్ల వరకు పనులు పూర్తి చేసినా ఐదేళ్లగా చుక్క నీరు పారలేదు. సీసీ లైనింగ్‌ పూర్తిగా రూపుకోల్పోయింది.

50 శాతం పనులు పూర్తి

మరమ్మతుల కింద షట్టర్లు, ఇతర పనుల కోసం 67 పనులు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటికే 33 పనులకుపైగా పూర్తయ్యాయి. ప్రధానంగా రహదారులు, షట్టర్లు ఇతర పనులు చేపడుతున్నాం. గతంలో ఉన్న ప్యాకేజీలన్నీంటిని ప్రభుత్వం రద్దు చేసింది. పనులు నాణ్యంగా జరిగేలా చూస్తాం. - వెంకటేశ్వర్లు, డీఈ, జలవనరులశాఖ (ఎమ్మిగనూరు డివిజన్‌)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.