కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. నంద్యాల ఎంపీడీవో కార్యాలయంలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందించారు. కొన్ని పెట్టెలు తుప్పు పట్టాయి. సరిగాలేని వాటిని సిబ్బంది తీసుకోలేదు. సిబ్బందికి మాస్కులు, సానిటైజర్లు, గ్లౌజులు ఇచ్చారు.
భోజనం ప్యాకెట్లు అందించే తరుణంలో సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. తెచ్చిన భోజనాలు సరిపోని కారణంగా అధికారులో వారికి వాగ్వాదం జరిగింది. తర్వాత స్పందించిన అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: