కర్నూలు జిల్లా చాగలమర్రి మండల కేంద్రంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. గుంత పాలెం ,కుమ్మరి వీధి ,పాత బస్టాండ్ ప్రాంతాలలో కుక్క దాడి చేయగా... ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిలో వృద్ధులు ,మహిళలు ,పిల్లలు సైతం ఉన్నారు. వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స చేస్తున్నారు. గాయపడిన వారిలో మహమ్మద్ అనే చిన్నారిని కర్నూలుకు తరలించారు. చాగలమర్రి లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా నివారణ చర్యలు చేపట్టలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి. విజయవాడ వాసులకు దసరా కానుక...అందుబాటులో కనకదుర్గ ఫ్లైఓవర్