శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ప్రవాహం తగ్గుతోంది. ఇన్ ఫ్లో 2,99,474 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,82,519 క్యూసెక్కులుగా ఉంది. 8 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ కు 2,19,456, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 26,037, హంద్రీనీవా ద్వారా 2026, పోతిరెడ్డిపాడు ద్వారా 35 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 883.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 207.84 టీఎంసీలుగా ఉంది.
ఇదీ చదవండి: