Unemployed Youth Protest: రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ నాయకులు నిరుద్యోగులతో కలిసి కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పోలీసు శాఖలో 18వేల ఖాళీలు ఉంటే.. కేవలం 6వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ విడుదల చేయటం.. నిరుద్యోగులను మోసం చేయడేమేనని ఆరోపించారు. అలాగే ఇచ్చిన నోటిఫికేషన్లో కానిస్టేబుల్ ఉద్యోగాల్లో హోంగార్డులకు 25శాతం రిజర్వేషన్ కల్పించటం సరికాదని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందన్నారు. నోటిఫికేషన్లో ప్రకటించిన ఉద్యోగాల ఖాళీల సంఖ్యను పెంచి.. వయో పరిమితి కూడా పెంచాలన్నారు.
ఇవీ చదవండి: