కరోనా కాలంలో మానవత్వం చాటుకుంటున్నారు కొందరు వ్యక్తులు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వసంత రాఘవ అనే వ్యక్తి తనకు వచ్చే అద్దె డబ్బులను వద్దనుకున్నారు. పట్టణంలో ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ భవన దుకాణ సముదాయాలకు ఈయన యజమాని. అందులో హోటల్, సెలూన్ వంటి 11 దుకాణాలు ఉన్నాయి. అతనికి ప్రతి నెలా దుకాణాలపై 2 లక్షల రూపాయలకు పైగా అద్దె వస్తుంది. లాక్డౌన్ దృష్ట్యా కిరాయిదారులు అద్దె చెల్లించడం భారమవుతుందని యజమాని వసంత రాఘవ భావించారు. ఏప్రిల్ నెల అద్దె చెల్లించవద్దని దుకాణాల నిర్వాహకులకు తెలిపారు. అంతేకాదు ఇలాంటి సమయంలోనూ అతనికి చెందిన లాడ్జిలో పని చేసే సిబ్బందికి జీతం ఇస్తూ... భోజనం, వసతి కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి