సొంత కుటుంబ సభ్యులనే పట్టించుకోని ఈ రోజుల్లో....పెంపుడు కుక్కకు అంత్యక్రియలు నిర్వహించి జంతు ప్రేమను చాటుకుంది కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన ఓ కుటుంబం. స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో పూజారిగా పని చేస్తున్న విజయ్ కుమార్... ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. 6ఏళ్లుగా దానిని కంటికి రెప్పలా... కన్న బిడ్డలా సంరక్షిస్తున్నారు. అయితే అనారోగ్యంతో కొన్ని రోజులుగా బాధపడుతున్న స్నూపీ మృతి చెందటంతో...యజమానుల బాధ వర్ణనాతీతంగా మారింది. స్నూపీకి అంత్యక్రియలు నిర్వహించి... తమ ప్రేమను చాటుకున్నారు.
ఇవీ చూడండి-ప్రకృతితో జాగ్రత్త అంటున్న అధ్యయనాలు