పంది పిల్లలనే తన బిడ్డలుగా సాకుతూ.. తన పిల్లలను వాటిలో చూసుకుని పాలిస్తూ... అమ్మతనానికి మారుపేరుగా నిలుస్తోందీ శునకం. కర్నూలు మాధవ్ నగర్లో పది రోజుల క్రితం ఓ కుక్క నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.... అవన్నీ అనారోగ్యంతో చనిపోయాయి. అప్పటి నుంచి జాతి బేధం పక్కన పెట్టి పంది పిల్లలకు తల్లి శునకం పాలిస్తూ జాగ్రత్తగా చూసుకుంటోంది. ఆ వరాహం కూనలూ.... సొంత తల్లిలా శునకం వెనకే తిరగుతున్నాయి. ఇదంతా చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి