ETV Bharat / state

Destroy Alcohol Bottles: రోడ్డు రోలర్​తో తొక్కించి.. మద్యం బాటిళ్లు ధ్వంసం చేసి - Destroy Alcohol bottles

Destroy Alcohol bottles with road roller in kurnool District: కర్నూలు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడ్డ మొత్తం మద్యంను రోడ్డు రోలర్​తో తొక్కించి ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన మద్యం విలువ రూ. కోటి 70 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.

Destroy Alcohol bottles
రోడ్ రోలర్​తో తొక్కించి మద్యం సీసాలు ధ్వంసం
author img

By

Published : May 24, 2022, 11:01 PM IST

కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖ్లీలో పట్టుబడ్డ నాటుసారా, కర్ణాటక అక్రమ మద్యం సీసాలను పోలీసులు రోడ్డు రోలర్​తో తొక్కించి ధ్వంసం చేయించారు. అదోని డీఎస్పీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ శివారులోని సిరుగుప్ప చెక్ పోస్ట్​ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన మొత్తం 410 కేసులో పట్టుబడిన 11 వేల 300 లీటర్ల నాటు సారా, మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి అన్నింటిని రోడ్ రోలర్​తో ధ్వంసం చేయించారు. ధ్వంసం చేసిన మద్యం విలువ రూ. కోటి 20 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.

రోడ్ రోలర్​తో తొక్కించి మద్యం ధ్వంసం

ఎమ్మిగనూరులో ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో 350 కేసుల్లో సీజ్ చేసిన 6130 లీటర్ల అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన మద్యం విలువ రూ. 50 లక్షల వరకు ఉంటుందని ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ చెప్పారు. అక్రమ మద్యం తరలింపులో సీజ్ చేసిన వాహనాలను వేలం వేయగా రూ. 60లక్షలు రాగా.. వాటిని ట్రెజరిలో జమ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.

నాటుసారా తయారీ స్థావరాలపై కర్నూలు జిల్లా పోలీసుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉలిందకొండ పోలీసు స్టేషన్ పరిథిలోని ఓబులాపురం తాండా గ్రామ పరిసర ప్రాంతాల్లో సెబ్, ఉలిందకొండ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. ఈదాడుల్లో 500 లీటర్ల బెల్లం ఊట, సారా తయారీ బట్టీలను ధ్వంసం చేసినట్లు ఉలిందకొండ ఎస్సై శరత్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: కూతురు ప్రేమ వివాహం.. యువకుడి చెవి కొరికేసిన తండ్రి !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.