తమ ప్రభుత్వం అటు సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఇటు అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. శనివారం ఆళ్లగడ్డ పట్టణంలోని శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను ఎలాంటి వివక్ష లేకుండా పార్టీలకతీతంగా లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు.
మరోవైపు అభివృద్ధి పథకాల కోసం 450 కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మైనార్టీలకు రాజకీయ పదవులను అధికంగా తమ పార్టీనే ఇచ్చిందన్నారు. మైనార్టీల అభివృద్ధికి సంబంధించిన పనుల కోసం స్థల సేకరణ చేస్తున్నామన్నారు. అవసరమైతే ఇందుకోసం వక్ఫ్ భూములను సేకరిస్తామన్నారు.
ఇదీ చదవండి:
రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాం: బొప్పరాజు