కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం ఆలూరు గ్రామానికి చెందిన అవుకు చెంచమ్మ డిగ్రీ పరీక్ష రాసిన అనంతరం సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
అవుకు చెంచమ్మ ఆళ్లగడ్డలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు. డిగ్రీ పరీక్ష, సర్పంచ్ ప్రమాణ కార్యక్రమం ఒకేరోజు రాగా.. మొదట పరీక్షకు హాజరైన ఆమె.. తర్వాత సర్పంచ్‌గా ప్రమాణం చేశారు. చదవుకుంటూనే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతానని ఆమె తెలిపారు.
ఇదీ చదవండి: నేటితో ముగియనున్న 34వ సీనియర్ జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలు