శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా...ప్రస్తుత నీటిమట్టం 882.5 అడుగులుగా ఉంది. జలాశయానికి ఇన్‌ఫ్లో 5,98,513 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 4,73,187 క్యూసెక్కులుగా ఉంది. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,831 క్యూసెక్కులు, ఎడమ గట్టు ద్వారా 38,140 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 2,400 క్యూసెక్కులు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేస్తుండగా.. హంద్రీనీవాకు 2,026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 34 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్‌లో...
నాగార్జున సాగర్ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా...ప్రస్తుత నీటిమట్టం 586.3 అడుగులుగా ఉంది. ఇన్‌ఫ్లో 5,67,280 క్యూసెక్కులు , ఔట్‌ఫ్లో 4,24,264 క్యూసెక్కులు ఉంది. మెుత్తం 26 గేట్ల ద్వారా 3,71,254 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి