శ్రీశైలమహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం తరఫున మంత్రి గుమ్మనూరు జయరాం దంపతులు, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం 2021 దేవస్థానం క్యాలెండర్లను ఆవిష్కరించారు.
ఆలయ ప్రత్యేక వేదికపై శ్రీ భ్రమరాంబ దేవి మహా గౌరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నంది వాహనంపై అధిష్ఠించి అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి: పారిశుద్ధ్య నిర్వహణ లోపం.. దుర్గంధభరితంగా వ్యవసాయ మార్కెట్