కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కాలేషా అనే 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు.. రెండో పోలీస్‌స్టేషన్ సీఐ కంబగిరి రాముడు పేర్కొన్నారు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఇంట్లోకి ఎత్తుకెళ్లి ఈ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వైద్య పరీక్షల్లో బాలికపై అత్యాచారం జరిగినట్లు వెల్లడైంది. ఫోక్సో, అత్యాచారం కేసులు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
కేసు ఆలస్యంపై ఎస్పీ సీరియస్!
ఈనెల 22వ తేదీన చిన్నారిపై అత్యాచారం జరిగితే కేసు నమోదు చేయడంలో ఎందుకు ఆలస్యం చేశారని.. జిల్లా ఎస్పీ డా.ఫక్కీరప్ప నంద్యాల పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యం గురించి వివరణ కోరినట్లు సమాచారం. విద్యార్థి, యువజన సంఘాలు సామాజిక మాధ్యమాల్లో అత్యాచార యువకుడిపై కేసు నమోదు చేయాలని డిమాండు చేసిన తర్వాత.. పోలీసులు రాత్రికి రాత్రి కేసులు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది.
ఇదీ చదవండి: