ETV Bharat / state

నేర చక్రం తిప్పుతున్న క్రైం పార్టీ కానిస్టేబుళ్లు..!

author img

By

Published : Nov 14, 2020, 9:59 AM IST

ప్రజల మానప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత గల పోలీసు ఆయన. సమాజంలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన వృత్తి. కానీ తన ప్రవర్తన చూస్తే నివ్వెర పోవాల్సిందేనని, వివిధ కేసుల్లో అనుమానితులను లక్ష్యంగా.. ఒత్తిళ్లు, వేధింపులకు గురిచేసి డబ్బు గుంజుకుంటాడని ఆరోపణలున్నాయి.

crime police in Kurnool district
crime police in Kurnool district

తాను లేకపోతే తన భార్య, పిల్లలకూ ఆ పోలీసుల వేధింపులు తప్పవనుకున్నాడేమో. బతకడం కంటే చావే నయం అనుకుంటూ చిన్నారుల నిండు జీవితాలను రైలు పట్టాలపై కన్నతండ్రి ఉంచాడంటే ఎంత క్షోభ అనుభవించాడో అర్థమవుతోంది. సలాం కుటుంబ ఆత్మహత్యలకు పోలీసుల ఒత్తిళ్లే కారణమని చెబుతుండగా, దానిలో హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌ది ప్రధాన పాత్రగా తెలుస్తోంది. 2019 నవంబరులో జరిగిన బంగారం అపహరణ కేసు నుంచి సలాంను నీడలా వెంటాడుతూ ఒత్తిడికి గురి చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారు దుకాణ యజమాని కుమారుడి ప్రోద్బలంతో గంగాధర్‌ రెచ్చిపోయి వార్నింగ్‌లిచ్చినట్లు సలాం చరవాణిలో ఆధారాలున్నాయన్నారు. సలాంను బెదిరించి బంగారం రికవరీ పేరుతో లంచాలు తీసుకోగలిగితే జేబులు నింపుకోవచ్చని గంగాధర్‌ ఆలోచనంటూ ముస్లిం నేతలు మండి పడుతున్నారు.

ఆత్మకూరులోనూ అదే తీరు

గతంలో గంగాధర్‌ ఆత్మకూరులో పనిచేశారు. అప్పుడూ ఇదే తీరున వ్యవహరించినట్లు సమాచారం. సివిల్‌ పంచాయితీల్లో కల్పించుకోవడం, స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదు అధికారుల వద్దకు వెళ్లకుండా మధ్యలోనే రాజీ చేసేవాడని ఆరోపణలున్నాయి. క్రైం పార్టీ పేరుతో మద్యం దుకాణాలు, హోటళ్లు, బార్లు, బియ్యం వ్యాపారులు, బెల్టు దుకాణాల వద్ద వసూళ్లకు తెర తీసేవాడని, క్రైంపార్టీలో లేకపోయినా యూనిఫాం వేసుకునేవాడే కాదని పలువురు తెలిపారు. అక్రమార్కులు, దొంగలు, పేకాట, మట్కా నిర్వాహకులతో సత్సంబంధాలు కొనసాగించేవాడన్న ముద్ర వేసుకున్నారు.

నంద్యాల క్రైం పార్టీ అంటేనే హడల్‌

క్రైం పార్టీ పెట్టిన ఉద్దేశం నేరాలు దర్యాప్తు చేయడం. కానీ నంద్యాల క్రైం పార్టీ పేరు చెబితేనే హడలిపోతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో దగ్గరుండి అక్రమ మద్యం అమ్మించారన్న ఫిర్యాదులొచ్చాయి. కొన్ని రోజుల క్రితం నంద్యాల రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న క్రైం కానిస్టేబుల్‌, 3వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన పేకాట విషయంలో జోక్యం చేసుకున్నారు. దొరికిన నగదును మాయం చేశారన్న ఆరోపణలతో మూడో పట్టణ సీఐతోపాటు, రెండో పట్టణ క్రైం కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

క్రైం పార్టీ కానిస్టేబుళ్లు ఏ స్టేషన్‌కు బదిలీ చేసినా తిరిగి నంద్యాలకు డిప్యూటేషన్‌పై వస్తుండటం గమనార్హం. కారణం నంద్యాలలో దొంగల నుంచి రికవరీలు, మట్కా, పేకాట, వ్యభిచారం, గుట్కా వ్యాపారం, తెలంగాణ మద్యం, క్రికెట్‌ బెట్టింగ్‌లు, నల్లబజారులో రాయితీ బియ్యం వంటివి క్రైంపార్టీ కనుసన్నల్లో జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గంగాధర్‌ వంటి క్రైం పార్టీ కానిస్టేబుల్‌ రూ.కోటిపైగా ఆస్తులు సంపాదించాడని, నంద్యాలలోని క్రైం పార్టీ కానిస్టేబుళ్ల అక్రమాస్తుల పైనా సీబీఐ విచారణ చేపట్టాలని ప్రజా సంఘాలు, ముస్లిం నేతలు డిమాండ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: ఏపీ ప్రాజెక్డులపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.