ప్రపంచ కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కర్నూలు నగరంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. భారత్, న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా... నగరంలోని కొత్తబస్టాండ్ వద్దనున్న ఓ షాప్లో 14 మంది బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు పట్ణణ నాలుగో పోలీస్స్టేషన్ పోలీసులు దాడులు చేసి బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.3 లక్షల 20వేల నగదు, ఎల్ఈడీ టీవీ, 10 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండీ...