క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఇందిరానగర్ కాలనీలో.. బెట్టింగ్ నిర్వహిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఆరు చరవాణిలు, లక్షా నలభై ఆరు వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: 'న్యాయవాది హత్య కేసులో భూమా కుటుంబాన్ని లాగడం సరికాదు'