కరోనా రెండో దశను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. వాక్సినేషన్ ప్రక్రియ ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం సరికాదని కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. కరోనాను అరికట్టాలంటే లాక్ డౌన్‌తో పాటు ప్రజలందరికి ప్రభుత్వమే ఉచితంగా వాక్సిన్ ఇవ్వాలని ఆయన సూచించారు.
గంగవరం పోర్టును అదానీకి అప్పగించడం సరికాదని.. క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. కరోనా సమయంలో రాష్ట్రంలో ఆస్తి, ఇతర పన్నులు పెంచడం తగదని మండిపడ్డారు.
ఇదీ చదవండి: