కర్నూలులోని కృష్ణనగర్ వద్ద ఫ్లైఓవర్‌ను వెంటనే నిర్మించాలని సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి వంతెన నిర్మాణం చేపట్టాలని పోరాటం చేస్తున్నప్పటికి ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణానికి అనుమతి వచ్చిందని...నిర్మాణం చేపడతామని స్థానిక ఎమ్మెల్యే చెప్పి సంవత్సరం అయినప్పటికీ పనులు ప్రారంభం కాలేదన్నారు. ప్రజా ప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు.
ఇదీ చదవండి