కర్నూలు కేఎస్ఆర్ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కేఎస్ఆర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో రోగులు మరణించిన ఘటనపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జిల్లా వైద్యాధికారి డాక్టర్.రామగిడ్డయ్య, కేఎస్ఆర్ ఆస్పత్రి ఎండీ ఇచ్చిన వివరణలు భిన్నంగా ఉన్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు.
కరోనా సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందే విధంగా చూడాలని కోరారు. కేఎస్ఆర్ ఆసుపత్రిలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.20 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.