CPI Ramakrishna fires on CM: డీజీపీని అవమానకరంగా వీఆర్‌కు పంపిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. చలో విజయవాడ ఉద్యమానికి సీఎం జగన్ మొండి వైఖరే కారణమన్న ఆయన.. తప్పు తాను చేసి నెపం మరొకరి మీద నెట్టడం ఎంతవరకు సబబన్నారు. ప్రత్యేక హోదా కోసం ఈనెల 25న విజయవాడలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని.. ఎంపీలంతా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:
వివేకా హత్య కేసు నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ... ఆ పిటిషన్లు కొట్టివేత