వరదల కారణంగా నష్టపోయిన రైతన్నలను ఆదుకోవాలని కోరుతూ...సీపీఐ నాయకులు పాపన్న హనుమప్ప, నెట్టి కంటెయ్య నిరసన చేపట్టారు. ఈ మేరకు కర్నూల్ జిల్లా మద్దికేర తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. నిత్యం కురుస్తున్న వర్షాల వల్ల పంటలన్నీ దెబ్బతిని అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ నాగభూషణంకి వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండీ...వరద బాధితులకు రామోజీ గ్రూప్ రూ.5 కోట్ల సాయం